News

వైసీపీకి జగన్ గుడ్ బై


వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేయ‌డం ఏంటి ? ఈ ప్ర‌శ్నే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిని తొల‌చి వేస్తోంది. వైసీపీ జ‌గ‌న్ వ‌దిలేసేసి ఏపీలో కాదు తెలంగాణ‌లో.. స‌మైక్యాంధ్ర‌లో వైసీపీ ఓ సంచ‌ల‌నం. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ ప్ర‌భావం రెండు రాష్ట్రాల్లోను గ‌ట్టిగా క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సైతం ఏపీ, తెలంగాణ‌లో అన్ని జిల్లాల్లోను ఓదార్పుయాత్ర పేరుతో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో వైసీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పాత్ర‌కు ప‌రిమిత‌మైతే తెలంగాణ‌లో కేవ‌లం మూడు ఎమ్మెల్య‌, ఖ‌మ్మం ఎంపీ సీటుకు ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తో పాటు ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గులాబి గూటికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ పార్టీ బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ పొంగులేటికి అప్ప‌గించారు. ఆయ‌న పార్టీ మారాక అక్క‌డ బాధ్య‌త‌లు త‌న సోద‌రి ష‌ర్మిల చూస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత పార్టీలో ఆమెకు ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో ఆమె సైతం సైలెంట్ అయిపోయారు. ఇక ఈ నెల 22న వైసీపీ తెలంగాణ ప్లీన‌రీ నిర్వ‌హిస్తార‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ కూడా వ‌స్తార‌ని ప్ర‌క‌టించారు. అయితే జ‌గ‌న్ అదే రోజు విశాఖ‌లో నిర్వ‌హించే మ‌హాధ‌ర్నాకు వెళుతున్నారు. దీంతో తెలంగాణ వైసీపీ ప్లీన‌రి నాయ‌కుడు లేని కార్య‌క్ర‌మంగా మొక్కుబ‌డి కానుంది. ఓ పార్టీ అధ్య‌క్షుడు ప్లీన‌రీనే లైట్ తీస్కొంటున్నాడు అంటే ఇక అక్క‌డ పార్టీ ఎలా పుంజుకుంటుంది అన్న ప్ర‌శ్న‌లు ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇక జ‌గ‌న్ సైతం తెలంగాణ‌లో ఏదో పార్టీ ఒక‌టి ఉంటే చాల‌న్న అభిప్రాయానికి ప‌రిమిత‌మైపోయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.